బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Third List of BJP Candidates Released,Third List of BJP Candidates,BJP Candidates Released,List of BJP Candidates,Mango News,Mango News Telugu, bjp candidates third list, bjp candidatesm kishan reddy, bandi sanjay, PM Modi, telangana assembly elections,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Third List of BJP Latest News,Third List of BJP Latest Updates,Bandi Sanjay Latest News,Bandi Sanjay Latest Updates,PM Modi Latest News,PM Modi Latest Updates
bjp, bjp candidates third list, bjp candidatesm kishan reddy, bandi sanjay, pm modi, telangana assembly elections

బీజేపీ విడుదల వారీగా తమ గెలుపుగుర్రాలను ఎన్నికల రంగంలోకి దింపుతోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మూడో జాబితా ఎప్పుడొస్తుందా అని పార్టీ నేతలు, ఓటర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర దించుతూ.. సుదీర్ఘ కసరత్తు తర్వాత అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ ప్రకటించింది. మూడో లిస్టులో మొత్తం 35 మందికి టికెట్లు కేటాయించింది. పలువురు సీనియర్ నేతలతో పాటు.. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఈసారి టికెట్ కేటాయించింది. ఈ జాబితాలో ఒకే ఒక్క మహిళకు అవకాశం దక్కింది. హుజూర్ నగర్ స్థానాన్ని శ్రీలతా రెడ్డికి కేటాయించారు.

ముషీరాబాద్ టికెట్‌ను బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్షి ఆశించారు. థర్డ్ లిస్టులో అయినా తన పేరు ఉంటుందని ఎదురు చూశారు. కానీ ఈసారి కూడా ఆమెకు నిరాశే ఎదురయింది. అధిష్టానం ఆమెకు మొండి చేయి చూపించింది. విజయలక్ష్మిని కాదని ముషీరాబాద్ టికెట్‌ను పోస రాజుకు కేటాయించింది. అలాగే గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట నియోజకవర్గం నుంచి కృష్ణయాదవ్‌ను బరిలోకి దించింది.

ఇకపోతే కొద్దిరోజులుగా ఆందోల్ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. సీనియర్ నేత, సినీనటుడు బాబు మోహన్.. ఆయన కొడుకు ఉదయ్ మధ్య పోటీ నెలకొంది. ఆందోల్ బీజేపీ టికెట్ కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. తనకే ఇవ్వాలంటే.. తనకే ఇవ్వాలంటూ అధిష్టానం వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారు. అప్పట్లో ఉదయ్‌కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందని గుసగుసలు వినిపించాయి. ఈక్రమంలో తనకు టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేయనని.. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తానని బాబు మోహన్ ప్రకటించారు. చివరికి బాబు మోహన్‌కే ఆందోల్ టికెట్‌ను అధిష్టానం కట్టబెట్టింది. మరి ఆయన బరిలోకి దిగుతారా? లేదా టికెట్ తిరస్కరిస్తారా అనేది చూడాలి.

మూడో విడత అభ్యర్థుల జాబితా

మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌

ఆసిఫాబాద్ – అజ్మీరా ఆత్మారాం నాయక్‌

బోధన్‌ – వడ్డి మోహన్‌రెడ్డి

బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ

నిజామాబాద్‌ రూరల్‌ – దినేశ్‌ కులాచారి

మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి

మెదక్‌ – పంజా విజయ్‌కుమార్‌

నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప

అందోల్‌ – పల్లి బాబూమోహన్‌

జహీరాబాద్‌ – రామచంద్ర రాజ నరసింహా

ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

ఎల్బీనగర్‌ –  సామ రంగారెడ్డి

రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి

చేవెళ్ల  – కేఎస్‌ రత్నం

పరిగి – బోనేటి మారుతి కిరణ్‌

ముషీరాబాద్‌ – పోస రాజు

మలక్‌పేట్‌ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి

అంబర్‌పేట – కృష్ణ యాదవ్‌

జూబ్లీహిల్స్‌ – లంకల దీపక్‌ రెడ్డి

సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి

సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి

నారాయణ్‌పేట్‌ – రతంగ్‌ పాండురెడ్డి

జడ్చర్ల – చిత్తరంజన్‌ దాస్‌

మక్తల్‌ – జలంధర్‌రెడ్డి

వనపర్తి – అశ్వత్థామరెడ్డి

అచ్చంపేట – దేవని సతీశ్‌ మాదిగ

షాద్‌నగర్‌ – అండె బాబయ్య

దేవరకొండ – కేతావత్‌ లాలూ నాయక్‌

హుజూర్‌నగర్‌ – చల్ల శ్రీలతారెడ్డి

నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌

ఆలేరు – పడాల శ్రీనివాస్‌

పరకాల – కాలి ప్రసాద్‌రావు

పినపాక  – పొడియం బాలరాజు

పాలేరు – నున్న రవికుమార్‌

సత్తుపల్లి – రామలింగేశ్వరరావు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 11 =