క్షమాపణ చెప్పాల్సింది బీజేపీనే, దేశం కాదు…ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్

Minister KTR Tweet to PM Narendra Modi over Prophet Remark Controversy, KTR Tweet to PM Narendra Modi over Prophet Remark Controversy, Telangana Minister KTR Tweet to PM Narendra Modi over Prophet Remark Controversy, Prophet Remark Controversy, Minister KTR Tweet to PM Narendra Modi, Prophet Remark Controversy News, Prophet Remark Controversy Latest News, Prophet Remark Controversy Latest Updates, Prophet Remark Controversy Live Updates, KTR Questions Apology Of India On Behalf Of BJP Leader's Remarks Over Prophet Mohammed, Minister KTR Questions Apology Of India On Behalf Of BJP Leader's Remarks Over Prophet Mohammed, Telangana Minister KTR Questions Apology Of India On Behalf Of BJP Leader's Remarks Over Prophet Mohammed, Apology Of India On Behalf Of BJP Leader's Remarks Over Prophet Mohammed, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ట్వీట్ చేశారు. బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలకు ఒక దేశంగా భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణలు చెప్పాలి?, క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప భారతదేశం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. రోజు విడిచి రోజు విద్వేషాన్ని చిమ్ముతున్నందుకు, వ్యాప్తి చేస్తున్నందుకు బీజేపీ ముందుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. అలాగే మహాత్మా గాంధీ హత్యను బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ప్రశంసించినప్పుడు ప్రధాని మోదీ మౌనం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మీరు దేనికి అనుమతిస్తున్నారో అదే మీరు ప్రచారం చేస్తారనే విషయాన్ని గుర్తు చేస్తున్నానని అన్నారు. టాప్ నుండి వచ్చిన నిశ్శబ్ద మద్దతు ద్వేషాన్ని బలపరిచిందని, అది దేశానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ముందుగా మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ, బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశంలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ వ్యాఖ్యలపై ఖతార్‌, ఇరాన్, కువైట్‌ వంటి దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత రాయబార్లకు సమన్లు పంపాయి. ఈ క్రమంలో నూపుర్‌ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ఆదివారం నాడు ప్రకటించింది. ఏదైనా ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని బీజేపీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీసినా, మతపరమైన వ్యక్తులను అవమానించినా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + twelve =