ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్

Bandi Sanjay Writes Letter to CM KCR over Release of Rs 4000 Cr Fee Reimbursement Funds, Bandi Sanjay Kumar Writes Letter to CM KCR over Release of Rs 4000 Cr Fee Reimbursement Funds, Release of Rs 4000 Cr Fee Reimbursement Funds, Bandi Sanjay Kumar Writes Letter to CM KCR, Bandi Sanjay Writes Letter to CM KCR over Release of Fee Reimbursement Funds, Fee Reimbursement Funds, Bandi Sanjay Kumar Writes Letter to KCR, Bandi Sanjay Kumar Writes Letter to Telangana CM KCR, 4000 Cr Fee Reimbursement Funds, Bandi Sanjay Kumar, Bandi Sanjay, Telangana BJP Chief Bandi Sanjay Kumar, BJP Chief Bandi Sanjay Kumar, Fee Reimbursement Funds News, Fee Reimbursement Funds Latest News, Fee Reimbursement Funds Latest Updates, Fee Reimbursement Funds Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా 4 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురౌతున్నారని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గత రెండు సంవత్సరాల నుండి 4 వేల కోట్ల రూపాయల ఫీజుల బకాయిలను రాష్ట్రప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, మొత్తం ఫీజులు విద్యార్థులు కట్టిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాత విద్యార్ధులకు తిరిగి తాము కట్టిన ఫీజులను వాపస్ ఇస్తామని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులనుండి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసి పేదప్రజలపై భారం మోపుతున్నారని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదలచేయకపోవడం వల్ల పేద విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఆర్థిక ఇబ్బందులకు గురౌతూ విద్యాసంస్థలు నడపడం వారికి పెనుభారంగా మారిందన్నారు. అనేక ప్రైవేట్ విద్యాసంస్థల్లో బోధనా సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సులో చేరడానికి ర్యాంకుల నిబంధన ఎత్తి వేసి అర్హులందరికీ పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, ఇంజనీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని, ఎస్టీ/ఎస్సీ/మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ/ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలాఖరులోపు మొత్తం 4 వేలకోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని పక్షంలో బీజేపీ తెలంగాణ శాఖ గాంధేయ పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 18 =