మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన.. హైదరాబాద్‌లో ‘టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ’ సంస్థ రూ.1250 కోట్ల పెట్టుబడులు

Minister KTR US Tour French-American Gas and Oil Giant TechnipFMC To Invest Rs 1250 Cr For Setting up Unit with in Hyderabad,Minister KTR US Tour,French-American Gas To Invest in Hyderabad,Oil Giant TechnipFMC To Invest Rs 1250 Cr,Mango News,Mango News Telugu,Oil Giant TechnipFMC Setting up Unit in Hyderabad,Telangana Gets More Investments,1250 crore Technip FMC Global Delivery Center,TechnipFMC,Minister KTR US Tour Latest News,Minister KTR US Tour Latest Updates,Minister KTR US Tour Live News,Hyderabad News,Telangana News,Telangana News Today

రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తూ వారి సంస్థల విస్తరణకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మారేలా మంత్రి కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ మరియు మెడికల్‌ డివైజెస్‌ ఉత్పత్తిలో గ్లోబల్‌ లీడర్‌ అయిన మెడ్‌ట్రానిక్ కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా పెట్టుబడులకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే హెల్త్‌కేర్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్ఐఎస్) మరియు హెల్త్‌కేర్ సపోర్ట్ సర్వీసెస్‌లో ప్రముఖ ప్రొవైడర్ అయిన ఈసీఎల్ఏటీ హెల్త్ సొల్యూషన్స్ సంయుక్తంగా క‌రీంన‌గ‌ర్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నాయి.

ఈ క్రమంలో తాజాగా మరో ప్రతిష్టాత్మక కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ దిగ్గజం అయిన టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ రూ.1250 కోట్లతో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ అండ్‌ ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా దీని ద్వారా ఇంజినీరింగ్‌ విభాగంలో 2,500 ఉద్యోగాలు, తయారీ రంగంలో మరో 1,000 వరకు మొత్తంగా మరో 3500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు. టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ నిర్ణయంతో హైదరాబాద్‌కు అదిపెద్ద ప్రోత్సాహం లభించినట్లయిందని, ఇక హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న తయారీ కేంద్రం నుంచి ఏడాదికి రూ.5,400 కోట్ల విలువైన ఎగుమతులు జరగనున్నాయని, హర్షం వ్యక్తం చేశారు.

కాగా ఎఫ్‌ఎంసీ టెక్నాలజీస్ ఆఫ్ అమెరికా మరియు టెక్నిప్ ఆఫ్ ఫ్రాన్స్ సంస్థల విలీనం కారణంగా టెక్నిప్ ఎఫ్‌ఎంసీగా ఏర్పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆఫ్‌షోర్, ఆన్‌షోర్ మరియు సబ్‌సీ ప్రాజెక్టులను చేపడుతోంది. ఇంధన రంగంలో ఇంజనీరింగ్, సేకరణ మరియు నిర్మాణ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. రష్యా, ఆస్ట్రేలియా, నార్వే, యుఎఇ, గయానా, మెక్సికో వంటి దేశాల్లో మరియు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో కూడా కంపెనీ అనేక ప్రాజెక్టులను చేపట్టింది. ఏపీలో వశిష్ట అండ్ ఎస్1 ఫీల్డ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eleven =