హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. పాల్గొననున్న పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, జూ.ఎన్టీఆర్‌ సహా పలువురు నటులు

NTR Centenary Celebrations Tollywood Actors Pawan Kalyan Prabhas Jr NTR and Others Will Attend at Hyderabad,NTR Centenary Celebrations,Tollywood Actors Pawan Kalyan,Tollywood Actor Prabhas Will Attend at Hyderabad,Jr NTR,NTR Centenary Celebrations at Hyderabad,Mango News,Mango News Telugu,Jr NTR to miss NTR's Centenary Event,Sr NTR Birthday,Star heroes moved for the big time,Huge guestlist for NTRs Centenary Celebrations,Pawan Kalyan,Prabhas,NTR Centenary Celebrations News Today,NTR Centenary Celebrations Latest News,NTR Centenary Celebrations Latest Updates

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, అలనాటి తెలుగు అగ్రనటుడు దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్‌ మైదానంలో శనివారం సాయంత్రం 5 గంటలకు భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇక ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖ తెలుగు కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తదితరులు హాజరుకానున్నారు.

అలాగే ఈ ఎన్టీఆర్‌ శత జయంతి సభకు నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, కన్నడ సినీ హీరో శివ రాజకుమార్‌ మరియు కళ్యాణ్ రామ్‌ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇంకా యువ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నితిన్, శర్వానంద్, సిద్ధు జొన్నలగడ్డ మరియు విశ్వక్ సేన్ తదితరులు కూడా పాల్గొననున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్లు రాఘవేంద్రరావు, నటి జయప్రద, మురళీ మోహన్‌, అశ్వనీదత్‌, జీ ఆదిశేషగిరిరావు, సుమన్‌ తదితరులు కూడా హాజరుకానున్నారని సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here