జపాన్‌ పర్యటనలో ప్రధాని మోదీ.. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

PM Modi Unveils The Bust of Mahatma Gandhi in Hiroshima Today During Japan Visit For G7 Summit,PM Modi Unveils The Bust of Mahatma Gandhi,The Bust of Mahatma Gandhi in Hiroshima Today,PM Modi During Japan Visit,PM Modi For G7 Summit,PM Modi in Hiroshima Today,Mahatma Gandhis Bust Unveiled,Mango News,Mango News Telugu,PM Modi G7 Summit Live,G7 summit LIVE updates,G7 Summit,G7 Summit 2023,G7 summit 2023 Live,G7 Summit in Japan,G7 Summit Latest News, G7 Summit Latest Updates, G7 Summit Live News, G7 Summit Quad Leaders Meet,PM Modi departs to attend the G7 summit,PM Narendra Modi Latest News,Prime Minister Narendra Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జపాన్‌లోని హిరోషిమా పట్టణంలో జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం జపాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న ప్రధాని మోదీ, మహాత్మా గాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. ‘హిరోషిమాలో మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించారు. హిరోషిమాలోని ఈ ప్రతిమ చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. శాంతి మరియు సామరస్యానికి సంబంధించిన గాంధీ ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి మరియు మిలియన్ల మందికి బలాన్ని ఇస్తాయి’ అని జపాన్‌లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఇక మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ప్రధాని మోదీ, ‘జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం నేను జపాన్‌లో పర్యటించినప్పుడు మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది. దాదాపు 1,40,000 మందిని బలిగొన్న రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జరిపిన అణుదాడిని ప్రస్తావిస్తూ నేటికీ ‘హిరోషిమా’ అనే పదం వింటేనే ప్రపంచం భయపడుతోందని అన్నారు. అలాంటి హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకువెళుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నేను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని ఇక్కడ హిరోషిమాలో నాటారని తెలుసుకోవడం నాకు గొప్ప క్షణం, తద్వారా ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు శాంతి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మహాత్మా గాంధీకి నా నివాళులర్పిస్తున్నాను’ అని ప్రధాని మోదీ తెలిపారు.

కాగా హిరోషిమాపై జరిగిన మొట్టమొదటి అణ్వాయుధ దాడి మానవ చరిత్రలో అత్యంత విషాదమైనది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆగష్టు 6, 1945 న అమెరికా ఈ అణుబాంబును యుద్ధ విమానం ద్వారా హిరోషిమా పట్టణంపై జారవిడిచింది. ఈ దాడి ఘటనలో దాదాపు 1,40,000 మంది మరణించినట్లు అంచనా. అలాగే ఊహించలేని ఆస్తి నష్టం కలిగించింది. పట్టణంలోని 80% భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే మూడు రోజుల తర్వాత, ఆగష్టు 9న, అమెరికా ‘నాగసాకి’ నగరంపై ‘ఫ్యాట్ మ్యాన్’ పేరుతో మరో అణుబాంబును వేసింది. దీంతో 75,000 మందికి పైగా మరణించారు. ఈ రెండు బాంబు దాడులతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది. అణుబాంబుల ప్రభావంతో ఆ నగరాల పరిధిలో సుమారు 60 సంవత్సరాల వరకు చిన్న గడ్డి మొక్క కూడా మొలవలేదంటే.. ఎంత విధ్వంసం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =