కేసీఆర్ ప్రభుత్వంలో భారీగా పెరిగిన పెన్షన్లు, మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు – మంత్రి కేటీఆర్

Minister KTR Video Conference with Women Beneficiaries of Various Govt Schemes on The Occasion of Raksha Bandhan, Telangana Minister KTR Video Conference with Women Beneficiaries of Various Govt Schemes on The Occasion of Raksha Bandhan, KTR Video Conference with Women Beneficiaries of Various Govt Schemes, Women Beneficiaries of Various Govt Schemes, Telangana Minister KTR Video Conference, Raksha Bandhan Wishes, Raksha Bandhan Greetings, Raksha Bandhan 2022, 2022 Raksha Bandhan, Rakhi, Minister KTR Video Conference News, Minister KTR Video Conference Latest News, Minister KTR Video Conference Latest Updates, Minister KTR Video Conference Live Updates, Mango News, Mango News Telugu,

రక్షా బంధన్ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో పెన్షన్లు భారీగా పెరిగాయని, ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు గణనీయంగా మెరుగుపరిచామని, సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 13.30 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు అందజేశామని, అలాగే 19 లక్షల మంది తల్లులకు పౌష్టికాహారం అందించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల్లో కోటా తగ్గించిందని, అయినా కేసీఆర్ ప్రభుత్వం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను పెంచిందని గుర్తు చేశారు. ఇక పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ‘కల్యాణ లక్ష్మి’ పథకం, నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్‌, మరో 14 లక్ష మంది ఒంటరి, వితంతు మహిళలకు పెన్షన్‌ ఇస్తున్నామని తెలిపారు. అలాగే స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 6 =