ఫామ్‌హౌజ్‌లో వడ్లపై విచారణకు సిద్ధమా.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

Ready to investigate Vad in the farmhouse Revanth Reddy fired on KCR,Ready to investigate Vad in the farmhouse,farmhouse Revanth Reddy fired on KCR,CM Revanth reddy, Telangana CM, Telangana assembly, Congress government,Mango News,Mango News Telugu,KTR Fires On CM Revanth Reddy,Telangana CM Revanth Reddy Latest News,Telangana CM Revanth Reddy Latest Updates,Revanth Reddy fired on KCR News Today,Revanth fired on KCR Latest News
CM Revanth reddy, Telangana CM, Telangana assembly, Congress government

తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొట్టి.. ఇనుప కంచెను తొలగించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజా భవన్‌కు తరలివస్తున్నారని వివరించారు. ఓటమి తర్వాతైనా బీఆర్ఎస్‌లో మార్పు వస్తుందని ఆశించామని.. కానీ వారిలో ఎటువంటి మార్పు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడైనా అసెంబ్లీలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నానని.. కానీ ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారని ఆరోపించారు.

గతంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే పోలీసులు వెనక్కి పంపించారని గుర్తు చేశారు. ప్రజాగాయకుడు గద్దర్‌ను కూడా అలాగే ప్రగతి భవన్ గేట్ల వద్ద గంటల తరబడి నెలబెట్టి అవమానించారని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ప్రజలు గమనించి గుర్తు పెట్టుకున్నారని.. అందుకే ఈసారి బీఆర్ఎస్‌ను ఓడించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునురద్ధరించి.. ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని వివరించారు. ప్రజల సమస్యలు వినేందుకు కూడా ప్రజాభవన్ గేట్లు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఇకపై సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కల్వొచ్చని వెల్లడించారు.

తమ ప్రభుత్వం కొలువుదీరిన మొదటి రోజే ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఆమోదం తెలిపామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ గ్యారెంటీలకు చట్ట బద్ధత కల్పించే కార్యాచరణను రూపొందిస్తున్నామని వెల్లడించారు. తమది ఉద్యమ పార్టీ అని చెప్పే కేసీఆర్.. ధర్నాచౌక్‌ను ఎత్తివేశారన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండి కేసీఆర్.. కనీసం తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న రేవంత్ రెడ్డి.. ఇదేనా రైతు ప్రభుత్వమని ప్రశ్నించారు. ముందే కేసీఆర్ పంట భీమా పథకం అమలు చేసి ఉంటే.. రైతుల ఆత్మహత్యలు తగ్గేవని చెప్పుకొచ్చారు. వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్.. తన ఫామ్‌హౌజ్‌లో 150 ఎకరాల్లో వరి పండించారని.. వడ్లను క్వింటాకు రూ. 4,250 కి అమ్ముకున్నారని చెప్పారు. దీనిపై విచారణకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =