జమ్మూకశ్మీర్ లోని ఆర్మీ బేస్ క్యాంప్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి, ముగ్గురు జవాన్లు వీరమరణం

Three Soldiers Martyred in Suicide Attack at Jammu and Kashmir's Rajouri Army Camp, Jammu and Kashmir's Rajouri Army Camp, Three Soldiers Martyred in Suicide Attack, Rajouri Army Camp, Three Soldiers Martyred, Suicide Attack, Jammu and Kashmir, Suicide Attack At Rajouri Army Camp, Rajouri Army Camp News, Rajouri Army Camp Latest News, Rajouri Army Camp Latest Updates, Rajouri Army Camp Live Updates, Mango News, Mango News Telugu,

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లో ఉన్న సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో ముగ్గురు సైనికులు వీరమరణం చెందగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం రాజౌరీ జిల్లా దర్హాల్ ప్రాంతంలోని పర్గల్‌లో ఉన్న ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భారత సైనికులు కాల్పులు జరుపగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ క్యాంపులోని ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన ముగ్గురు సైనికులు మరణించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నం, కాల్పుల ఘటనతో రాజౌరి జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో జిల్లా అంతటా భారీగా సాయుధ బలగాలను మోహరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here