తెలంగాణలో 2030 నాటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ. 36,300 కోట్ల పెట్టుబ‌డులు, స్వాగ‌తించిన మంత్రి కేటీఆర్

Minister KTR Welcomes Amazon Web Services For Enhancing Investment of Rs 36300 Cr by 2030 in Telangana,Minister KTR Welcomes,Amazon Web Services,Enhancing Investment,Investment of Rs 36300 Cr,Mango News,Mango News Telugu,Amazon Web Services in Telangana,Amazon Web Services in Telangana 2030,Telangana 2030,Telangana 2030 Amazon Web Services,Amazon Web Services,Amazon Web Services Latest News and Updates,Amazon Web Services News and Updates,AWS,AWS Latest News and Updates

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ సెంట‌ర్ (ఏడ‌బ్ల్యూఎస్) రాష్ట్రంలో మరిన్ని పెట్టుబ‌డులు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏడ‌బ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్ సందర్భంగా తమ ఏడ‌బ్ల్యూఎస్ ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్‌లో 2030 నాటికి రూ. 36,300 కోట్ల పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నేపథ్యంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగ‌తించారు. తెలంగాణ ప్రజలకు మేలు కలిగేలా ఇ-గ‌వ‌ర్నెన్స్‌, హెల్త్‌కేర్‌ మరియు మున్సిపల్ కార్య‌క‌లాపాల‌ పనితీరును మెరుగుప‌రిచేందుకు ఈ డేటా సెంట‌ర్ల‌ను ఉప‌యోగిస్తామ‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, పలు అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.

కాగా హైదరాబాద్ జోన్ ఏడ‌బ్ల్యూఎస్ నెట్‌వర్క్‌కు సంబంధించి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో క్లౌడ్ అడాప్షన్‌పై దృష్టి సారించే కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇక అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించిన దాని ప్రకారం.. 2030 నాటికి రాష్ట్రంలో మొత్తం 4.4 బిలియన్ డాలర్లు (రూ. 36,300 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇక అంతకుముందు 2020లో (2.7 బిలియన్లు) (రూ.20,096 కోట్లు) ప్రకటించిన పెట్టుబడికి ఇది అదనం. అలాగే హైదరాబాద్‌ పరిధిలోని చందన్‌వెల్లి, ఫ్యాబ్ సిటీ మరియు ఫార్మా సిటీలో ఏడ‌బ్ల్యూఎస్ ఏర్పాటు చేసిన మూడు డేటా సెంటర్ క్యాంపస్‌లలో ఈ పెట్టుబడి దశల వారీగా పెంచబడుతుంది. ఇక ఈ మూడు డేటా సెంటర్లు దాని క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్‌లకు మరింత క్లౌడ్ రీజియన్‌లను ఎంచుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడు డేటా సెంటర్లలో మొదటి దశ పూర్తయి క్లౌడ్ సేవలను పొందేందుకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + one =