తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాలు భేష్ – పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

Parliamentary Standing Committee on Health and Family Welfare had Interaction session with Telangana Govt Officials,Parliamentary Standing Committee,Health and Family Welfare,Interaction session with Telangana Govt,Telangana Govt Officials,Mango News,Mango News Telugu,Parliamentary Standing Committee Members,Parliamentary Standing Committees,Parliamentary Standing Committee Reports,Parliamentary Standing Committee On Public Works,Parliamentary Standing Committee On Information Technology,Parliamentary Standing Committee On Home Affairs,Parliamentary Standing Committee On Health And Family Welfare,Parliamentary Standing Committee On Finance,Parliamentary Standing Committee On Energy,Parliamentary Standing Committee On Education,Parliamentary Standing Committee On Defence,Parliamentary Standing Committee On Commerce,Parliamentary Standing Committee Chairman,Department Related Parliamentary Standing Committee

రాష్ట్రంలో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై అధ్యయనం నిమిత్తం పార్లమెంటరీ స్ధాయి స్టాండింగ్ కమిటీ శుక్రవారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్న ఆరోగ్య సంరక్షణ, నిర్వహణ చర్యలు, ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలు కార్యక్రమాలపై పార్లమెంటరీ కమిటీ సభ్యులు సమీక్షించారు. భువనేశ్వర్ కలితా నేతృత్వంలోని కమిటీ ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలో నిర్వహణ కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని ఆమె పేర్కొన్నారు.

వైద్య కళాశాలల నిమిత్తం ప్రభుత్వం భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేపట్టినట్లు ఆమె కమిటీకి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా గర్భిణులకు ఆర్థిక సాయం ఇతర ఆరోగ్య సంబంధిత పథకాలను వివరాలను కమిటీ కి తెలియచేశారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా “అంధత్వ రహిత తెలంగాణ” లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల అమలుతీరుపై పార్లమెంటరీ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రశంసించారు. ఈ సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =