కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, నగరంలోని 91 వార్డులలో 115 శిబిరాలు: మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav Inaugurates Kanti Velugu Program Camp at Cantonment,Telangana Minister Talasani Srinivas Yadav,Minister Talasani Srinivas Yadav,Talasani Srinivas Yadav,Santi Kumari Visits AV College,Inspected the Kanti Velugu Centre,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme,Kanti Velugu-2 Programme,Kanti Velugu Programme Telangana,Telangana Kanti Velugu Programme,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు ఒక గొప్ప వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గన్ బజార్ లో కంటి వెలుగు శిభిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. శిబిరానికి కంటి పరీక్షల కోసం వచ్చిన వారిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంతో గొప్ప మనసుతో ఆలోచించి పేద, మద్య తరగతి ప్రజలకు మేలు చేసే విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. నగరంలోని 91 వార్డులలో 115 శిభిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ లో కంటి పరీక్ష కు 500 రూపాయలకుపైగా, ఆపరేషన్ కోసం వేలాది రూపాయలు ఖర్చవుతాయని, కంటి వెలుగు కార్యక్రమంతో ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్ళద్దాలు అందించడంతో పాటు, ఉచితంగా ఆపరేషన్ లు కూడా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని వివరించారు. ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్షలు చేయించుకొన్న వారు మీమీ ఇంటి పరిసరాలలోని వారు కూడా ఉపయోగించుకొనే విధంగా తెలియజెప్పాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =