శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ది సాధ్యమైంది: సీఎం కేసీఆర్

Telangana CM KCR Extends Wishes to People on the Occasion of May Day,Mango News,Mango News Telugu,Telangana CM KCR,CM KCR,KCR,CM KCR Latest News,CM KCR News,CM KCR Live,CM KCR Pressmeet,CM KCR Pressmeet Live,CM KCR Wishes,CM KCR Extends Wishes to People on the Occasion of May Day,May Day,May Day 2021,CM KCR On May Day,CM KCR Conveyed May Day Greetings To Telangana People,CM KCR Conveyed May Day Greetings,Telangana,Telangana News,CM KCR Extends May Day Greetings To Telangana People,CM KCR Live News,CM KCR Live Latest,KCR Warm Wishes To Telangana People,Telangana CM KCR Latest News,International Labours Day,International Workers Day,CM KCR Wishes To Telangana People

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్మిక కర్షక కష్ట జీవులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ది సాధ్యమైందని, మానవజాతి పురోగతి, కష్టం చేసే చేతుల మీదినించే కొనసాగుతూ వస్తున్నదని సీఎం తెలిపారు. వివిధ ఫాక్టరీల్లో పనిచేసే కార్మికులతోపాటు, వ్యవసాయాధారిత భారతదేశంలో అధిక జనాభా భూమిని నమ్ముకుని బతుకుతున్నారని పేర్కొన్నారు. రైతులుగా, కూలీలుగా, వ్యవసాయ అనుబంధ వృత్తి కులాలుగా తమ శ్రమను ధారపోస్తూ దేశ, రాష్ట్ర అభివృద్దిలో వారు భాగస్వాములైనారని సీఎం కేసీఆర్ అన్నారు.

మేడే స్పూర్తితో సబ్బండ వృత్తి కులాల సంక్షేమం, అభివృధి కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలూ కృషి చేస్తుందని, ఆదర్శవంతమైన కార్మిక కర్షక విధానాలను అమలు పరుస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. వృత్తి కులాల కోసం, పేరు పేరునా అమలు చేస్తున్న పథకాలు వారి సామాజిక ఆర్ధిక అభివృద్దికి దోహదం చేస్తున్నాయని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం వివరించారు. ఉత్పత్తి సేవా రంగాల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పారిశ్రామిక విధానం తెలంగాణలో సంపద సృష్టితో పాటు లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడుతున్నదని సీఎం కేసీఆర్ మేడే సందర్భంగా తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =