ష‌ర్మిల ఫిక్స్.. ఓట‌ర్లు ఎవ‌రికి ఫిక్స్ అవుతారో..

Sharmila fix Who will the voters fix,Sharmila fix,Who will the voters fix,Mango News,Mango News Telugu,ys sharmila, ysrtp, telangana politics, telangana assembly elections,Telangana Politics, Telangana Political News and Updates,Hyderabad News,Telangana News,Telangana Assembly Elections,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Sharmila Latest News,Sharmila Latest Updates
ys sharmila, ysrtp, telangana politics, telangana assembly elections

వైఎస్‌ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఒంట‌రిగా పోటీకి ఫిక్స్ అయ్యారు.  పాలేరు నుంచే అసెంబ్లీ బ‌రిలో దిగి తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రానికి సై అంటున్నారు. నవంబరు 4న ఆమె పాలేరు నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తార‌ని ఆ పార్టీ ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. అంతేకాదు.. ఒక‌టి నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తార‌ని పేర్కొంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఆమె పాలేరు నుంచి పోటీ చేయ‌డం ఉత్కంఠ‌గా మారింది. ఇప్ప‌టికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచే బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి కి మ‌ద్ద‌తుగా అక్క‌డే స‌భ ఏర్పాటు ప్ర‌చారాన్ని హోరెత్తించారు.

మ‌రోవైపు కాంగ్రెస్ నుంచి ఆర్థికంగా, రాజ‌కీయంగా కీల‌క నేతైన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. ఆయ‌నైతే ఉమ్మడి ఖ‌మ్మంలో ఏకంగా బీఆర్ ఎస్ అభ్య‌ర్థులు ఎవ‌రినీ అసెంబ్లీ గేటు తాక‌నీయ‌ను అని సినిమా డైలాగులు చెబుతూ.. చాలెంజ్ లు విసురుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ష‌ర్మిల పాలేరునే ఎంచుకోవ‌డం చ‌ర్చ‌నీయంశంగా మారింది. పాలేరు అంటే గ్రామాల్లో , వ్యసాయ పనుల్లో సహాయకుడు.  వాడుక భాషలో చెప్పాలంటే వ్యవసాయ కూలీ. ఆ పేరుతో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  ప్రజలకు (వ్యయ)సాయం చేసేందుకు ఎందరెందరో పోటీ పడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు కర్షకుడిగా  సేవలందించేందుకు అవకాశం కావాలంటున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఆహ్వానిస్తున్న, ఆపార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న అందరికీ పాలేరే ప్రాథమ్యంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎవరికి ప్రాధాన్యత నిస్తుందన్నది ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ల‌క్ష్యం మార్చుకున్న తుమ్మ‌ల‌

అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ తనకు టిక్కెట్‌ ఇస్తుందని భావించిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ లభించకపోవడంతో ప్రజల కోసం రాజకీయాల్లో ఉంటానన్నారు. రాజకీయంగా మంచి పేరున్న తుమ్మలను తమ పార్టీలోకి రావాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానించ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో తాను పోటీచేసిన పాలేరు నుంచే పోటీచేసే యోచనలో ఉన్న ఆయన ఆ సీటునే కోరుతున్నారు. గత ఎన్నికల్లో తాను అక్కడి నుంచి ఓటమిపాలు కాగా, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరడం, తిరిగి ఆయనకే టిక్కెట్‌ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఓడిన చోటునుంచే గెలవాలనే లక్ష్యంతో ఉన్న తుమ్మల ఆ సీటు కోరుతున్నారు. మ‌రి ఏమైందో ఏమో.. తుమ్మ‌ల సీటు మార్చుకున్నారు.

షర్మిల రాజకీయ క్షేత్రం

ఇక వైఎస్‌ షర్మిల తన రాజకీయ ప్రస్థానంలో పాలేరుకే ప్రాధాన్యత నివ్వడమే కాక, అక్కడి నేలసాక్షిగా తాను పాలేరు బిడ్డనని ప్రతిజ్ఞ చేశారు. క్యాంప్‌ కార్యాలయం నిర్మాణం తదితరమైనవి చేపట్టారు. తాను పోటీచేసేది అక్కడి నుంచే నని ఎంతో కాలం క్రితమే ప్రకటించారు. తన పార్టీ వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశలో భాగంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కూడా కలిశారు. కర్నాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నా,  ప్రజాక్షేత్రం నుంచి గెలిచి నాయకురాలినని నిరూపించుకునేందుకు తను రాజకీయక్షేత్రంగా ఎంచుకున్న పాలేరు ఇవ్వాలని డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్ స‌మ్మ‌తించ‌క‌పోవ‌డంతోనే విలీనం ప్ర‌కియ ఆగింది. ఈ నేప‌థ్యంలో త‌న పార్టీ నుంచే పాలేరు బ‌రిలో దిగుతున్నారు. ఉద్దండుల మ‌ధ్య ష‌ర్మిల నెగ్గుకు ఎలా నెగ్గుకువ‌స్తారో.. ఓట‌ర్లు ఎవ‌రిక ఫిక్స్ అయ్యారో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =