జగిత్యాలలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్

Ministers Harish Rao Koppula Eshwar Inaugurates Mother and Child Hospital at Jagtial, Ministers Harish Rao And Koppula Eshwar Inaugurates Mother and Child Hospital at Jagtial, Ministers Harish Rao And Koppula Eshwar Inaugurated Mother and Child Hospital at Jagtial, Ministers Harish Rao And Koppula Eshwar Launches Mother and Child Hospital at Jagtial, Ministers Harish Rao And Koppula Eshwar Starts Mother and Child Hospital at Jagtial, Mother and Child Hospital at Jagtial, Ministers Harish Rao And Koppula Eshwar, Minister Harish Rao, Minister Koppula Eshwar, Mother and Child Hospital, Jagtial, Mother and Child Hospital News, Mother and Child Hospital Latest News, Mother and Child Hospital Latest Updates, Mother and Child Hospital Live Updates, Jagtial Mother and Child Hospital, Telangana Ministers Harish Rao And Koppula Eshwar, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుదవారం ఉదయం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో జగిత్యాల పట్టణంలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఆరోగ్య రంగాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో సిజేరియన్లు తగ్గి, సాధారణ ప్రసవాలు పెరగాలని, సిజేరియన్లకు అయ్యగార్లు ముహూర్తాలు పెట్టే మూఢనమ్మకం పోవాలని చెప్పారు. సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెంచడంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ వైద్యులది ముఖ్య పాత్ర అని, సాధారణ ప్రసవాలు చేసే ప్రభుత్వ వైద్య బృందానికి మూడువేల ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం అమలు చేస్తామని, అదేవిధంగా సిజేరియన్లు చేసే వైద్య బృందానికి ఇన్సెంటివ్ తొలగిస్తున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య వ్యవస్థను బలోపేతం చేశాక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే ఇప్పుడు 56 శాతానికి పెరిగాయన్నారు. 108, 102 అమ్మ ఒడి వాహనాలు ఉన్నాయని, బిడ్డ పుడితే 12,000 రూపాయలు, కేసీఅర్ కిట్స్ ఇస్తున్నామని, అయినప్పటికీ కొందరు ఇంకా ప్రైవేటు ఆసుపత్రులకు ఎందుకు పోతున్నారని మంత్రి ప్రశ్నించారు. అలాగే కరోనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జరిపిన జ్వర సర్వే అద్భుతమని, ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంలోనే మన రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు కావడం వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి సీఎం కావడం వల్లనే జగిత్యాల జిల్లాగా ఏర్పడిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. చిన్న పిల్లలకు నాడు అనారోగ్య సమస్యలు వస్తే, హైదరాబాద్ దాకా పోవాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి జగిత్యాలలోనే ఏర్పాటైందని చెప్పారు. నేడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 13 =