సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన, మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాల పనులకు శంకుస్థాపన

Minister KTR Lays Foundation for Govt School Renovation Works Under Mana Ooru Mana Badi in Sircilla, KTR Lays Foundation for Govt School Renovation Works Under Mana Ooru Mana Badi in Sircilla, Govt School Renovation Works Under Mana Ooru Mana Badi in Sircilla, Foundation for Govt School Renovation Works, Mana Ooru Mana Badi in Sircilla, Govt School Renovation Works, Mana Ooru Mana Badi, Sircilla Mana Ooru Mana Badi, Sircilla, Mana Ooru Mana Badi News, Mana Ooru Mana Badi Latest News, Mana Ooru Mana Badi Latest Updates, Mana Ooru Mana Badi Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మించిన స్వాగత తోరణాన్ని మరియు కూడలిలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టనున్న పునరుద్ధరణ పనులుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా రాష్ట్రంలో దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం, పదిరకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు నిర్మించుకోనున్న రా రైస్ మిల్లు నిర్మాణానికి మరియు పెట్రోల్ బంక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితుల సాధికారత, స్వావలంబన కోసమే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వారంతా మంచి వ్యాపార వేత్తలుగా ఎదగాలని అన్నారు. దళితులకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేసే పథకం దేశంలోనే ఎక్కడా లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =