సనత్ నగర్ లో రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు కేటిఆర్, తలసాని

Foundation for Railway Under Bridge, Foundation for Railway Under Bridge in Sanath Nagar, KTR, Minister KTR, Minister Talasani Srinivas, Railway Under Bridge in Sanath Nagar, Sanath Nagar, Talasani, talasani srinivas yadav

సనత్ నగర్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో 68.30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జూలై 29, బుధవారం ఉదయం 10.00 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంతో గత 30 సంవత్సరాలుగా సనత్ నగర్ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారం కానుంది. ప్రస్తుతం సనత్ నగర్ ప్రాంత ప్రజలు నర్సాపూర్ చౌరస్తా, జీడిమెట్ల కు వెళ్ళాలన్నా, జీడిమెట్ల నుండి సనత నగర్ వైపుకు రావాలన్నా పతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా సుమారు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంతో కేవలం 1.8 కిలోమీటర్ల ప్రయాణించి తమ గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. దూరాభారం తగ్గడమే కాకుండా పతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ట్రాఫిక్ రద్దీ కూడా భారీగా తగ్గనుంది.

గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వస్తున్నారు. స్థానిక ప్రజల ద్వారా సమస్య ను తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మే 15 వ తేదీన మేయర్ బొంతు రాంమోహన్, హెఛ్ఆర్డీ, రైల్వే అధికారులతో కలిసి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ ప్రాధాన్యతను మంత్రి తలసాని మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్ళి వివరించగా, నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే హెఛ్ఆర్డీ అధికారులు రైల్వే అధికారులకు రైల్వే శాఖ పనుల నిమిత్తం 89.70 లక్షల రూపాయలను చెల్లించారు.

అలాగే ప్రస్తుతం 2 లైన్ లుగా ఉన్న పతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ని సుమారు 400 మీటర్లు మేర 45.04 కోట్ల రూపాయల ఖర్చుతో 4 లైన్ లుగా విస్తరించే నిర్మాణ పనులను కూడా మంత్రి కేటిఆర్ ప్రారంభిస్తారు. ఇందులో 36 లక్షల రూపాయలను హెఛ్ఆర్డీ అధికారులు రైల్వే అధికారులకు రైల్వే శాఖ పనుల నిమిత్తం చెల్లించారు. అప్పటి ట్రాపిక్ రద్దీకి అనుగుణంగా నిర్మించిన పతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రస్తుతం పెరిగిన వాహనాల రద్దీ తో నిరంతరం ట్రాపిక్ స్తంభించి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 లైన్ లుగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి విస్తరించి నిర్మించడం వలన సమస్య పరిష్కారం కానుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 9 =