జంతర్‌ మంతర్‌ దీక్ష ఏర్పాట్లలో ఉన్నా, ఈనెల 11న విచారణకు హాజరవుతా.. ఈడీకి తెలిపిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Tells ED She will Appear For Questioning on March 11 Because of Jantar Mantar Diksha Arrangements,MLC Kavitha Tells ED,MLC Kavitha Appear For Questioning,MLC Kavitha Questioning on March 11,Jantar Mantar Diksha Arrangements,Mango News,Mango News Telugu,Kalavakuntla Kavitha News,MLC Kavitha Latest News and Updates,MLC Kavitha Live Updates,Telangana Latest News,Telangana News Today,Telangana Political News And Updates,Jantar Mantar Diksha Latest Updates

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) పంపిన సమన్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల దృష్ట్యా గురువారం విచారణకు హాజరు కాలేనని ఆమె తెలిపారు. మార్చి 10 (శుక్రవారం)న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ప్రతిపాదించిన ధర్నా ఉందని, ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నానని ఆమె ఈడీకి వివరించారు. ఆ దీక్ష పూర్తయిన తర్వాతి రోజు, అంటే మార్చి 11న ఈడీ విచారణకు హాజరవుతానని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె కేంద్ర ఏజెన్సీకి లేఖ ద్వారా అభ్యర్థించారు. బుధవారం సాయంత్రం ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు రాసిన లేఖలో, మార్చి 15న ఈడీ ముందు హాజరుకావాలని గతంలో తాను చేసిన అభ్యర్థనను హఠాత్తుగా తిరస్కరించడం వెనుక గల కారణాలను కవిత ప్రస్తావించారు.

ముందస్తు కమిట్‌మెంట్‌లు ఉన్నందున, రాబోయే వారంలో తన షెడ్యూల్‌ను ఇప్పటికే ప్లాన్ చేసుకున్నందున మార్చి 11న విచారణకు వస్తానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. కాగా కవిత లేఖపై గురువారం స్పందించిన ఈడీ, ఆమె విన్నపానికి ఓకే చెప్పింది. కవిత పేర్కొన్నట్లు 11వ తేదీన విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. దీంతో, ఈ అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఈడీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. రేపు జంతర్‌మంతర్‌ దగ్గర కవిత దీక్ష యదావిథిగా కొనసాగనుంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీ కవిత గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =