బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: మొదలైన నాలుగో టెస్టు.. హాజరైన ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని ఆల్బనీస్‌

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్టు నేడు అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానమంత్రులు హాజరయ్యారు. తొలిరోజు వీరిద్దరూ కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ కు బీసీసీఐ ఘనంగా ఆహ్వానం పలికింది. ప్రత్యేక మెమెంటోతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనిని సత్కరించింది. అలాగే ప్రధాని మోదీకి బీసీసీఐ కార్యదర్శి జై షా జ్ఞాపికను అందజేశారు. ఇరు జట్ల కెప్టెన్లు తమ జట్టు ఆటగాళ్లను ప్రధానులు పరిచయం చేశారు. కాగా ఇప్పటికే తొలి రెండు టెస్టులను గెలుచుకున్న టీమిండియా.. అనూహ్యంగా మూడో టెస్టులో దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ దక్కించుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. అలాగే మరోవైపు ఆసీస్‌ కూడా ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.

ఇక వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరాలంటే నాలుగో టెస్టులో టీమిండియా తప్పక నెగ్గాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా లేదా డ్రా చేసుకున్నా.. భారత్ ఫైనల్ చేరాలంటే శ్రీలంక-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపుకోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. కాగా మ్యాచ్ తొలి రోజు దాదాపు 1లక్ష మంది ప్రేక్షకులు హాజరవ్వొచ్చని గుజరాత్ క్రికెట్ సంఘం అంచనా వేస్తోంది. అంతేకాకుండా అహ్మదాబాద్‌ స్టేడియానికి మోదీ పేరు పెట్టాక, ఆయన తొలిసారి వీక్షించనున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. అలాగే ఇరు దేశాల ప్రధానులు మ్యాచ్‌కు హాజరవుతున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాలను ఎస్పీజీ భారీ భద్రత ఏర్పాటు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =