తెలంగాణలో రేపటినుంచే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Non-Agricultural Properties Registations In Telangana will Start From Tomorrow,Non-Agricultural,Telangana,Non Agricultural,Non-Agricultural Properties Registations In Telangana,Non-Agricultural Properties Registations Start From Tomorrow,Mango News,Mango News Telugu,Public Demands to Start Non-Agricultural Land Registration Process,CM KCR,Telangana,Telangana High Court,Public Demand,Telangana Latest News,Telangana New Registration,Dharani Portal Telangana,Non Agricultural Land Registration,Telangana New Revenue Act,Land Registrations In Telangana,Online Property Registration,Dharani Land Registration,Land Registration In Telangana,Real Estate,Telangana Real Estate,Cm KCR,KCR Latest News

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11, శుక్రవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్టేషన్స్ ప్రారంభంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చారు. “హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను రేపటి నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు” అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపి పలు సూచనలతో అనుమతిచ్చింది. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు జరిపేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా స్లాట్‌ బుకింగ్‌ విధానంతో కంప్యూటర్‌ ఆధారిత పద్దతిలో రిజిస్ట్రేషన్లు నిర్వహించవచ్చని కోర్టు పేర్కొంది. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఖచ్చితంగా ఉండాలన్న నిబంధనకు కోర్టు అంగీకారం తెలిపింది. అలాగే రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఆధార్‌, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =