పెండింగ్ బిల్లుల వ్యవహారంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

Telangana Governor Tamilisai Soundararajan Takes Key Decision Regarding Pending Bills,Telangana Governor Tamilisai Soundararajan,Tamilisai Soundararajan,Telangana Governor,Mango News,Mango News Telugu,Soundararajan Takes Key Decision,Tamilisai Soundararajan Decision Regarding Pending Bills ,Tamilisai Soundararajan Regarding Pending Bills,Tamilisai Soundararajan at Raj Bhavan Today,Raj Bhavan Today,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆమె సోమవారం తన వద్ద పెండింగ్‌లో ఉన్న వాటిలో మూడు బిల్లులను ఆమోదించారు. మరో రెండు బిల్లులను వెనక్కి పంపారు. ఇంకో రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. అలాగే మరో మూడు బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు. ఇదిలా ఉండగా మరోవైపు సుప్రీంకోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లులకు సంబంధించిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

2022 సెప్టెంబర్ 14 నుంచి 2023 ఫిబ్రవరి మధ్య కాలంలో 10 బిల్లులను గవర్నర్ వద్దకు పంపించామని, అయితే ఇంతవరకూ వాటికి ఆమోదం రాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. ఈ క్రమంలో నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.

ఇప్పటి వరకు గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు..

1. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజు) (సవరణ) బిల్లు.
2. తెలంగాణ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు.
3. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (విశ్వాసం యొక్క వయస్సు నియంత్రణ) (సవరణ) బిల్లు.
4. యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు.
5. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు.
6. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు.
7. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (స్థాపన, నియంత్రణ) (సవరణ).
8. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు.
9. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు.
10. తెలంగాణ మునిసిపాలిటీల నిబంధనల చట్ట (సవరణ) బిల్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =