గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు 3 నుంచి సాధారణ వైద్య సేవలు తిరిగి ప్రారంభం

Gandhi Hospital, Gandhi Hospital Non-Covid Services to Resume, Gandhi Hospital to resume non-COVID services, General health services in Gandhi Hospital, Hyderabad’s Gandhi Hospital, Hyderabad’s Gandhi hospital to resume general non-COVID, Hyderabad’s Gandhi Hospital to resume non-Covid services, Mango News, Non-Covid care to resume in Telangana’s Gandhi Hospital ., Non-Covid Services to Resume, Non-Covid Services to Resume at Gandhi Hospital, Non-Covid Services to Resume at Gandhi Hospital From August 3rd, Secunderabad

రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో దాదాపు నాలుగు నెలల అనంతరం గాంధీ ఆసుపత్రిలో మళ్ళీ సాధారణ వైద్య సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 3 నుంచి అన్నిరకాల వైద్యసేవలు తిరిగి ప్రారంభిస్తున్నామని, కోవిడ్ తో పాటుగా ఎమర్జెన్సీ సర్వీస్ లు, ఓపీ, ఐపీ సేవలను కూడా అందుబాటులో తీసుకువస్తున్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు.

గాంధీ ఆసుపత్రిలో నాన్-కోవిడ్ బాధితుల ప్రవేశాలకు మరియు వెళ్ళడానికి సంబంధించిన పూర్తిస్థాయి కోవిడ్ ప్రోటోకాల్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించే నాన్-కోవిడ్ బాధితులు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టం చేశారు. మరోవైపు కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్‌ రాజారావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + sixteen =