ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ విడుద‌ల, నామినేషన్స్ దాఖలు ప్రారంభం

2021 Telangana MLC Elections, Graduates MLC Elections, Mango News, MLC Elections, MLC Elections In Telangana, MLC Elections Notification, MLC Elections Notification 2021, Notification Released for Telangana Graduates MLC Elections, telangana, Telangana Graduates MLC Elections, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections Notification, Telangana MLC Elections Notification 2021

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పక్రియ మొదలైంది. ఈ స్థానాలకు మార్చి 31, 2021 తో పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రెండు స్థానాలకు సంబంధిత రిట‌ర్నింగ్ అధికారులు ఈ రోజు (ఫిబ్రవరి 16, మంగళవారం) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో మంగళవారం నుంచే నామినేషన్లను స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్లను ఫిబ్రవరి 23 వరకు ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల మధ్య స్వీక‌రించ‌నున్నారు. అలాగే మార్చి 14 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 17న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 16
  • నామినేషన్ల స్వీకరణ ప్రారంభం – ఫిబ్రవరి 16
  • నామినేషన్లకు ఆఖరితేదీ – ఫిబ్రవరి 23
  • నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 24
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఫిబ్రవరి 26
  • ఎన్నిక జరిగే తేదీ – మార్చ్ 14
  • పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
  • ఓట్ల లెక్కింపు – మార్చ్ 14
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − seven =