ప్ర‌పంచ ఉత్త‌మ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికైన తెలంగాణలోని భూదాన్ పోచంప‌ల్లి

Best Tourism Villages by UNWTO, Mango News, Pochampally, Pochampally selected as UNWTO Best Tourism village, Pochampally Village, Pochampally Village in Telangana, Pochampally Village in Telangana Selected as One of the Best Tourism Villages, Pochampally Village in Telangana Selected as One of the Best Tourism Villages by UNWTO, telangana, Telangana’s Pochampally, Telangana’s Pochampally bags UN’s best tourism village award, UN selects Telangana’s Pochampally, UN’s best tourism village award, UNWTO, UNWTO selects Pochampally in Telangana

తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రామానికి అరుదైన ఘనత దక్కింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భూదాన్ పోచంప‌ల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూటీఓ) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. ముందుగా యూఎన్ డబ్ల్యూటీఓ ఉత్తమ పర్యాటక గ్రామ కేటగిరి కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ భారత్ నుండి మూడు గ్రామాలను సిఫార్సు చేసింది. మేఘాలయలోని కొంగ్‌థాంగ్, మధ్యప్రదేశ్ లోని లధ్‌పురా ఖాస్ మరియు తెలంగాణలోని పోచంపల్లి గ్రామాలను నామినేట్ చేయగా, పరిశీలన అనంతరం పోచంపల్లి గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోచంపల్లి ప్రత్యేకమైన చేనేత వస్త్రాలకు మరియు నమూనాలకు ప్రసిద్ధి. ఇక డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే యూఎన్ డబ్ల్యూటీఓ జనరల్ అసెంబ్లీ 24వ సెషన్ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు పోచంప‌ల్లి గ్రామానికి ఇవ్వబడనుంది. మరోవైపు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడం పట్ల భూదాన్ పోచంప‌ల్లి ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =