సిద్దిపేట కలెక్టర్​ గా సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ ఎం.హనుమంతరావుకు అదనపు బాధ్యతలు

Collector M Hanumantha Rao, M Hanumantha Rao Given Full Additional Charge as Siddipet Collector, Mango News, Sangareddy Collector, Sangareddy Collector M Hanumantha Rao, Sangareddy Collector M Hanumantha Rao Given Full Additional Charge as Siddipet Collector, Siddipet Collector, Siddipet Collector Venkatram Reddy, Siddipet Collector Venkatram Reddy Resigned, Siddipet collector Venkatrami Reddy resigns, Telangana News

సిద్దిపేట జిల్లా కలెక్టర్​ గా ఎం.హనుమంతరావుకు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న హనుమంతరావుకు సిద్దిపేట కలెక్టర్​ గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట క‌లెక్ట‌ర్‌ గా ఆయన బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు.

ముందుగా ఇప్పటివరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ గా ఉన్న వెంకట్రామిరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్వచ్చంద విరమణ కోరుతూ తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కు అందజేశారు. మరోవైపు వెంకట్రామిరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన జరగనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు తాజాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా ఆ జాబితాలో ఉన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 9 =