ముగిసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది, ఢిల్లీకి తిరుగుపయనం

President Droupadi Murmu Returns to Delhi after Concluding her Winter Sojourn in Telangana,President Draupadi Murmu, Draupadi Murmu Hyderabad winter vacation, Murmu complete schedule,President schedule December 30,Mango News,Mango News Telugu,President Droupadi Murmu,President Draupadi Murmu Speech,Mango News,Mango News Telugu,India’S President Droupadi Murmu,Droupadi Murmu Is India'S New President,Droupadi Murmu Is 15Th President,Droupadi Murmu Elected As India'S New President,Droupadi Murmu Takes Oath As 15Th President Of India,Droupadi Murmu Becomes India'S 15Th President,Droupadi Murmu Takes Oath As President Of India,India President Droupadi Murmu,Droupadi Murmu New President,President Of India Droupadi Murmu,Presidential Candidate Draupadi Murmu,India President 2022 Draupadi Murmu

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దేవస్థానంను, రామప్ప ఆలయాన్ని, శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) విగ్రహాన్ని, నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. అలాగే హైదరాబాద్ లో పలు కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం వీరనారీలతో సమావేశమయి, వారిని సత్కరించారు.

అనంతరం నగరంలో శీతాకాల విడిదిని ముగించుకుని, శుక్రవారం సాయంత్రం 3.40 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. అక్కడనుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో 3.55 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు తిరిగి పయనమయ్యారు. పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న రాష్ట్రపతికి హకీంపేట ఎయిర్ బేస్ వద్ద తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్ హరీశ్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + one =