రైతుబంధు కోసం డిసెంబర్ 20 వరకు కొత్త రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరణ

Rythu Bandhu Scheme: New Applications From Farmers Will Accept Upto December 20,Farmers 2020 Apply Raithu Bandhu Scheme,Raithu Bandhu Scheme Apply,Rythu Bandhu Scheme,Rythu Bandhu Scheme Latest News,Rythu Bandhu Scheme Latest Update,Rythu Bandhu Scheme New Applications,Rythu Bandhu Scheme New Applications Accept Upto December 20,Good News For Farmers Raithu Bandhu Scheme 2020-21,Raithu Bandhu New Registration Apply 2021,Rythu Bandhu,Rythu Bandhu Latest News,Rythu Bandhu Applications,Mango News,Mango News Telugu,CM KCR,Telangana,Telangana News,Telangana Rythu Bandhu Scheme

రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు యాసంగి సీజన్ రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని, ఇందుకు అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో యాసంగి 2020 రైతు బంధు సహాయానికి సంబంధించి వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

డిసెంబర్ 10 నాటికీ ధరణిలో నమోదైన రైతుల వివరాలను సీసీఎల్‌ఏ ద్వారా రైతుబంధు పోర్టల్ లోకి తీసుకొచ్చినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇక రైతుబంధు పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు ఆ గ్రామాల యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి దరఖాస్తు ఫారంతో పాటుగా, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. అలాగే బ్యాంకు అకౌంట్ నంబర్లు తప్పుగా ఉన్నవారు, అకౌంట్ క్లోజ్ అయినవారు, అకౌంట్ మార్చుకోవాలనుకునే వారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించారు. ఇక వానాకాలం సమయంలో అకౌంట్ ఇచ్చి, రైతుబంధు పొందిన రైతులు మళ్ళీ వివరాలు అందించాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =