తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు దక్కించుకున్న షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ

Construction Contract of Telangana New Secretariat, Shapoorji Pallonji Company, Telangana New Secretariat, Telangana New Secretariat Building, Telangana New Secretariat Construction, Telangana New Secretariat Construction Contract, Telangana New Secretariat Construction Contract Shapoorji Pallonji Company, Telangana New Secretariat News, Telangana New Secretariat Updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా నిర్మించే సచివాలయ భవన సముదాయం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా రూపొందాలని, అదే సందర్భంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయం నిర్మాణ పనులను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది.

ముందుగా ప్రభుత్వ ఈ-బిడ్డింగ్‌ కు ఎల్‌అండ్‌టీ మరియు షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. రూ.494 కోట్లకు ప్రభుత్వం టెండర్‌ ఆహ్వానించగా, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 4 శాతం, ఎల్‌అండ్‌టీ 4.8 శాతం ఎక్కువగా బిడ్డింగ్ దాఖలు‌ చేశాయి. టెండర్‌ పత్రాల అధ్యయనం అనంతరం ఎల్-1 గా నిలిచిన షాపూర్‌జీ పల్లోంజీకి సచివాలయ నిర్మాణ పనులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అలాగే సచివాలయ నిర్మాణాన్ని 12 నెలల లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + three =