ఏపీలో ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు నవంబర్ 6 వరకు పొడిగింపు

Andhra Pradesh, AP Inter Admission 2020, AP Inter admission 2020-2021 date extended, AP Intermediate Admissions, AP Intermediate Admissions Application Deadline Extended, Application Deadline Extended to November 6 in AP, Intermediate Admissions Application, Intermediate Admissions Application Deadline, Intermediate Admissions Application Deadline Extended

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇంటర్మీయట్ ప్రవేశాలను ఆన్‌లైన్ విధానం ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ప్రవేశాల కోసం అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 29 వరకు https ://bie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే తాజాగా ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాల దరఖాస్తు గడువును నవంబర్ 6 వ తేదీ వరకు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ గురువారం నాడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ ద్వారా ఇంటర్ రెగ్యులర్ కోర్సులతో పాటుగా ఒకేషనల్ కోర్సులకు కూడా దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ప్రవేశాల విషయంలో విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్‌ చేయొచ్చని అధికారులు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 12 =