225 రహదారులకు 867.51 కోట్లతో పనులు, పీఎంజీఎస్ వై రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ ఆమోదం

Chairmanship of CS Somesh Kumar, CS Somesh Kumar Standing Committee of PMGSY, Mango News, PMGSY, pmgsy guidelines, PMGSY Met under Chairmanship of CS Somesh Kumar, pmgsy scheme, Pradhan Mantri Gram Sadak Yojana, Pradhan Mantri Gram Sadak Yojana News, Pradhan Mantri Gram Sadak Yojana Scheme, State Level Standing Committee of PMGSY, State Level Standing Committee of PMGSY Met, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Holds Review Meeting On Frame Work For Action Plan On Road Safety, Telangana Pradhan Mantri Gram Sadak Yojana

ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్ వై) రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో 1412.98 కిలోమీటర్లు విస్తీర్ణం గల 225 రహదారులకు రూ.867.51 కోట్లతో పనులను ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై)-III, బ్యాచ్–II క్రింద చేపట్టుటకు రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఈ ప్రతిపాదనలు మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ పనులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 వాటాలో నిధులు సమకూర్చుతాయి. అలాగే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద పనుల పురోగతిని కూడా ఈ కమిటీ సమీక్షించింది.

ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ ఛీఫ్ జనరల్ మేనేజర్ వై.వి రావు, ఎంపవార్డ్ ఆఫీసర్, ఇంజనీర్ ఇన్ ఛీఫ్, పీఆర్, పీఎంజీఎస్ వై ఎ.జి సంజీవ రావు మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 8 =