తిరుపతి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే శీఘ్రదర్శనం టికెట్లు

APSRTC Buses, apsrtc tirumala darshan ticket, APSRTC to sell Sheeghra Darshan tickets, APSRTC to sell Sheeghra Darshan tickets for Tirumala, Mango News, Seeghra Darshan scheme, Tirumala, TTD, ttd darshan tickets, ttd darshan with bus ticket, ttd online booking, TTD Seeghra Darshan Tickets, TTD Seeghra Darshan Tickets in APSRTC Buses, TTD Seeghra Darshan Tickets Now Available in APSRTC Buses

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోనే 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఈ ప్రత్యేకమైన అవకాశం కల్పించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చు. ప్రతి రోజు ఉదయం 11.00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ టికెట్లు పొందే ప్రయాణికులకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు.

తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేయనున్నారు. కావున తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ కోరారు. ఏపీఎస్ఆర్టీసీ‌ ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతుంది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంమని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ అవకాశం కల్పించిన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి మరియు ఈ.ఓ కే.ఎస్ జవహార్ రెడ్డికి ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 5 =