హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ రేపే

Badvel By-election Counting, Badvel By-election Results, Badvel By-election Results 2021, Huzurabad Assembly Election Results 2021, Huzurabad Badvel By-election, Huzurabad Badvel By-election Counting, Huzurabad Badvel By-election Counting will be held Tomorrow, Huzurabad bypoll, Huzurabad bypoll results, huzurabad election exit poll results, huzurabad election results, Huzurabad Election Results 2021, huzurabad election results exit poll, huzurabad exit poll 2021, Huzurabad exit poll results, huzurabad results

తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (నవంబర్ 2, మంగళవారం) జరగనుంది. హుజూరాబాద్ ఓట్ల కౌంటింగ్ కోసం కరీంనగర్‌ లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా, ముందుగా 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. హుజూరాబాద్ పోరులో 30 మంది బరిలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుండగా, ఒక్కో హళ్లో 7 టేబుళ్ల చొప్పున మొత్తం రెండు హాళ్లలో 14 టేబుల్స్ పై కౌటింగ్ జరుగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కౌంటింగ్ హాల్లో అన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

ఇక బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో జరగనుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 4 హాళ్లలో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. బద్వేలు పోరులో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం పది రౌండ్స్ లోనే ఓట్లను లెక్కింపు జరగనుండగా, ఫలితం త్వరగానే వెల్లడి కానున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + fourteen =