మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi Congratulates Anwar Ibrahim on his Election as the Prime Minister of Malaysia,Prime Minister Modi, Prime Minister of Malaysia Anwar Ibrahim,Prime Minister of Malaysia,Mango News,Mango News Telugu,Prime Minister Of India,Prime Minister Narendra Modi,Prime Minister Anwar Ibrahim,Anwar Ibrahim Latest News And Updates,Prime Minister Narendra Modi,Modi Congratulated Anwar Ibrahim,Prime Minister Modi Latest News and Updates,Malasiya News And Updates,India News and Live Updates,Malasiya,India

మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీంకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. “మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు అన్వర్ ఇబ్రహీంకు అభినందనలు. భారతదేశం-మలేషియా మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ముందుగా శ‌నివారం జ‌రిగిన మలేసియా ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మెజారిటీ రాక హంగ్‌ పార్లమెంటుకు దారితీసింది. మలేసియా పార్లమెంట్ లో మొత్తం 222 సీట్లు ఉండగా, మెజారిటీ కావాలంటే 112 సీట్లు సాధించాల్సి ఉంది. అయితే అన్వ‌ర్‌ ఇబ్రహీంకు చెందిన పకటన్ హరపాన్ అనే అలయన్స్ 82 సీట్లు, మాజీ ప్రధాని ముహియుద్దీన్‌ యాసిన్‌ కు చెందిన పెరికటన్ నేషనల్ బ్లాక్ 73 సీట్లు మాత్రమే గెలుచుకుని మెజార్టీ సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో మలేసియా రాజు అల్‌ సుల్తాన్‌ అబ్దుల్లా ఎన్నికైన పార్లమెంటు సభ్యులతో సంప్రదింపులు జరిపి కొత్త ప్ర‌ధానిగా అన్వ‌ర్‌ ఇబ్రహీంను నియ‌మించారు. ఈ క్రమంలో మలేసియా ప్రధానిగా అన్వర్‌ ఇబ్రహీం గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. అన్వర్ ఇబ్రహీం మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కలిగివున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన, ఓసారి జైలు శిక్ష కూడా అనుభవించారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన అన్వర్ ఇబ్రహీం ఎట్టకేలకు మలేసియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 20 =