నేడు కరీంనగర్‌లో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరవనున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భాఘెల్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

T-Congress will Hold Public Meeting at Karimnagar Today Chhattisgarh CM Bhupesh Baghel To Attend Along with TPCC Chief Revanth Reddy,T-Congress will Hold Public Meeting,Chhattisgarh CM Bhupesh Baghel at Karimnagar,TPCC Chief Revanth Reddy at Karimnagar Meeting,Mango News,Mango News Telugu,Chhattisgarh Cm To Address K'nagar Meet,Karimnagar cops set 23 conditions for Meeting,Congress Leaders Making Arrangements,Congress Revanth Reddy Public Meeting,T-Congress Latest Updates,Congress Meeting Live News,Karimnagar News Today,Congress Latest News and Updates

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్ర తొలిదశలో ఇప్పటివరకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పట్టణంలోని స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సారథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి సీఎం భూపేష్ భాఘెల్ ప్రసంగించనున్నారు. అలాగే మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంచార్జి జైరాం రమేష్ కూడా కరీంనగర్ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 4 =