తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు: కొత్తగా 10 లక్షల పెన్షన్లు, 5111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ

Telangana Cabinet Decisions Sanction 10 Lakh New Pensions Decides to Recruit 5111 Anganwadi Teachers Staff, Telangana Cabinet Decisions Decides to Recruit 5111 Anganwadi Staff, Telangana Cabinet Decisions Decides to Recruit 5111 Anganwadi Teachers, Telangana Cabinet Decisions Sanction 10 Lakh New Pensions, 10 Lakh New Pensions, 5111 Anganwadi Teachers, Telangana Cabinet Meeting, Telangana Cabinet Decisions, Telangana Cabinet Decisions News, Telangana Cabinet Decisions Latest News, Telangana Cabinet Decisions Latest Updates, Telangana Cabinet Decisions Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:

  • రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్తవి, పాతవి కలిపి మొత్తంగా 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
  • స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం.
    కోఠి ఈ.ఎన్.టి ఆసుపత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు, కోఠి ఈ.ఎన్.టి ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈ.ఎన్.టి టవర్ నిర్మించాలని నిర్ణయం.
  • అదేవిధంగా సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని వైద్య ఆరోగ్యశాఖను కేబినెట్ ఆదేశించింది.
  • కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కేబినెట్ నిర్ణయం.
  • రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
  • స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, మరియు స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఈనెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల, పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని కేబినెట్ నిర్ణయించింది.
  • రాష్ట్రంలో జీవో 58, 59 కింద పేదలకు స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కేబినెట్ ఆదేశించింది.
  • గ్రామకంఠం స్థలాల్లో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న నిర్ణయం జరిగింది.
  • వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయింపు.
  • తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
  • షాబాద్ లో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి స్థలాల కేటాయింపు కోసం 45 ఎకరాల భూమిని కేటాయింపు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =