కేబినెట్ విస్తరణపై సీఎం కేసీఆర్ కసరత్తు

Cabinet Expansion Likely Before Dasara Festival, KCR Telangana Cabinet Expansion, Mango News Telugu, Telangana Cabinet Expansion, Telangana Cabinet Expansion Latest Updates, Telangana Cabinet Expansion Likely Before Dasara Festival, Telangana Cabinet Expansion News, Telangana Cabinet Expansion Updates, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 12 మంది ఉండగా, విస్తరణలో మరో ఆరుగురు చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఒకేసారి ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా, రెండు దఫాలుగా విస్తరణ చేపడతారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబర్ నెలలో లేదా, దసరా లోపు మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్టు సమాచారం. ఆరుగురికి చోటు కల్పించే విషయంపై వివిధ సమీకరణాల పరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకో వైపు రెండు దఫాలుగా విస్తరణ చేపట్టి, ఒక్కోసారి ముగ్గురికి అవకాశం కల్పించబోతున్నట్టు కూడ ప్రచారం జరుగుతుంది.

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్తు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్, వినయ్ భాస్కర్, దానం నాగేందర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేబినెట్ లో మహిళల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి ఒకరికి లేదా ఇద్దరికీ స్థానం లభించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, హరిప్రియ నాయక్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సామాజిక సమీకరణాలను దృష్ట్యా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు లకు కేబినెట్ లో స్థానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, విస్తరణకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here