1.76 లక్షల కోట్ల బదిలీకి రిజర్వ్ బ్యాంకు ఆమోదం

Finance Ministry of India, GoI To Use RBI Rs 1.76 Lakh Crores To Boost Indian Economy, GoI To Use RBI’s Rs 1.76 Lakh Crores To Boost Indian Economy, indian economy, Latest National Political News Today, Mango News, national political news, National Political News 2019, National Political News Today, Nirmala Sitharaman, Prime Minister Narendra Modi, RBI Board Approves Rs 1.76 Lakh Crore Transfer, RBI Board Approves Rs 1.76 Lakh Crore Transfer To Central Govt, RBI Rs 1.76 Lakh Crores To Boost Indian Economy

కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులు బదలాయింపు చేయడానికి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు సోమవారం బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం, రూ. 1.76 లక్షల కోట్లలో రూ. 1.23 లక్షల కోట్లు 2018-19 సంవత్సరానికి సంబంధించిన డివిడెండ్‌ గాను, మిగిలిన రూ. 52,637 కోట్లు అదనపు నిల్వలుగా గుర్తించినట్టు తెలిపారు. ఇప్పటివరకు ఆర్‌బీఐ ప్రభుత్వానికి ఇచ్చిన నిధులలో ఇదే అత్యధిక మొత్తంగా నిలిచింది.

2018-19 సంవత్సరానికి గాను రూ. 1.76,051 కోట్లను బదిలీ చేయడానికి ప్రస్తుత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కేంద్ర బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఇంత ఎక్కువ మొత్తంలో కేంద్రప్రభుత్వానికి నిధులు బదిలీకి ఆర్‌బీఐ అంగీకారం తెలుపడంతో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. ఈ విధానాన్ని దోపిడీగా అభివర్ణించారు. ప్రస్తుత ఆర్థిక విపత్తు నుంచి ఎలా బయటపడాలో తెలియక, ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్‌బీఐ నుంచి నిధుల బదిలీ మార్గాన్ని ఎంచుకున్నారని, అయితే ఇది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అని పేర్కొన్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు . కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వారిని, సీనియర్ నాయకులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here