రైతులకు రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా, సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం

3 Lakh Ex-gratia Farmers who Lost Lives Fighting Farm Laws, CM KCR’s Decision to Offer Rs 3 Lakh Ex-gratia Farmers who Lost Lives Fighting Farm Laws, Farmers praise CM KCR for ex gratia, Kisan Ekta Morcha, Kisan Ekta Morcha Appreciated CM KCR’s Decision to Offer Rs 3 Lakh Ex-gratia Farmers, Kisan Ekta Morcha Appreciated CM KCR’s Decision to Offer Rs 3 Lakh Ex-gratia Farmers who Lost Lives Fighting Farm Laws, Mango News, Rs 3 lakh each to Delhi’s dead farmers, Telangana CM announces 3 lakh to kin of each farmer, Telangana CM announces Rs 3 lakh for kin of farmers, Telangana CM KCR

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైన 750 మందికి పైగా రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే అమరులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, వారిపై నమోదైన అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కాగా సీఎం కేసీఆర్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు రైతుల కోసం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమంలో కీలకమైన కిసాన్ ఏక్తా మోర్చా కూడా సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేసింది.

“కిసాన్ ఆందోళనలో సుమారు 700 మంది అమరులైన రైతుల త్యాగాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అమరవీరుల బంధువులకు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరవీరుల కుటుంబానికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ప్రకటించడమే కాకుండా, ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించాలని మరియు అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు అందించే ఈ ఎక్స్‌గ్రేషియా కోసం తెలంగాణ ప్రభుత్వానికి సంయుక్త కిసాన్‌ మోర్చా అమరవీరుల జాబితాను అందజేస్తుంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =