తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆఫీసులను వర్చువల్ గా ప్రారంభించనున్న జేపీ నడ్డా

BJP National President JP Nadda will inaugurate BJP District Offices in Telangana and Andhra Pradesh Today,BJP National President JP Nadda,President JP Nadda will inaugurate BJP District Offices,JP Nadda in Telangana and Andhra Pradesh Today,BJP National President JP Nadda in Telangana,Mango News,Mango News Telugu,JP Nadda to inaugurate BJP offices,Nadda drops visit to state today,BJP national president Nadda cancels visit to Telangana,Nadda calls off Telangana visit,President JP Nadda Latest News,President JP Nadda Latest Updates,BJP Party

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు (మార్చి 31, శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆఫీసులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసుతో పాటుగా, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలలో పార్టీ ఆఫీసులను జేపీ నడ్డా ప్రారంభిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో పార్టీ ఆఫీసులను కూడా జేపీ నడ్డా వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు బీజేపీ ఒక ప్రకటన చేసింది.

ముందుగా జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించి, సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే జేపీ నడ్డా పర్యటన రద్దుకావడంతో సంగారెడ్డి సహా ఇతర జిల్లాలలోని పార్టీ ఆఫీసులను కూడా వర్చువల్ గా ప్రారంభించి, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, శివప్రకాశ్ జీ, రాష్ట్ర ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిల సమావేశం యధావిధిగా జరుగుతుందని చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here