కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

2022 Parliament Budget session, 2022 Union Budget, Budget Session of the Parliament 2022, CM KCR, KCR Press Meet over Union Budget 2022-23, Mango News, Mango News Telugu, Parliament Budget Session, Parliament Budget Session 2022, Parliament Budget Session Updates, Telangana CM KCR, Telangana CM KCR Press Meet, Telangana CM KCR Press Meet over Union Budget, Telangana CM KCR Press Meet over Union Budget 2022-23, Union Budget, Union Budget 2022-23, Union Budget 2022-23 Updates

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని కేసీఆర్ విమర్శించారు. నిరుద్యోగులకు కానీ, మధ్యతరగతి వర్గాలకు కానీ, పేద ప్రజలకు కానీ ఈ బడ్జెట్ వలన ఎలాంటి ఉపయోగం కలగలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి కనీస ప్రస్తావన కూడా తేలేదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో చెప్తున్నవన్నీ అబద్దాలే అని, దేశ ప్రజలను మోసం చేస్తోందని కేంద్రంపై మండిపడ్డారు కేసీఆర్. దళితులు, గిరిజనుల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు కేసీఆర్. మైనార్టీలకు ఎలాంటి మేలు కలిగే చర్యలు తీసుకోలేదని కేసీఆర్ అన్నారు.

సాధారణంగా.. ఎక్కడైనా నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్ముతారని, కానీ కేంద్రం మాత్రం లాభాల్లో ఉన్న ఎల్ఐసీ ని అమ్ముతోందని కేసీఆర్ పరిహసించారు. ఎయిరిండియాను కూడా అమ్మేశారని కేంద్రం తీరుని నిరసించారు కేసీఆర్. ఎలాంటి సెక్యూరిటీ లేని క్రిప్టో కరెన్సీని తీసుకురావడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. దానిని అధికారికంగా గుర్తించకుండా దానిపై 30% పన్ను ఎలా విధిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతులు పెంచుతారని ఆశించామని.. అయితే ఆ రంగానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దారుణమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టారని కేసీఆర్ విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + sixteen =