త్వరలో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Union Budget 2022, India's Own Digital Currency Coming Soon by RBI Announces Finance Minister Nirmala Sitharaman,Union Budget, India's Own Digital Currency Coming Soon by RBI, Finance Minister Nirmala Sitharaman,India's Own Digital Currency ,Cryptocurrency,RBI to bring India's own digital rupee,Budget 2022,India To Have Its Own Digital Currency,India Union Budget 2022,India's own digital currency to launch soon, indian digital currency price, rbi digital rupee, indian digital currency name,mango news

2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో.. భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలోనే డిజిటల్ రూపీని జారీ చేయనుందని నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపీని రూపొందించబోతున్నట్లు నిర్మల తెలిపారు. రాష్ట్రాలకు రూ.1 లక్ష కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. డిజిటైజేషన్, అర్బన్ ప్లానింగ్ చేసే రాష్ట్రాలకు ఈ రుణాలను జారీ చేస్తామన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులు.. మొదలగు ఈ నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు మంగళవారం చెప్పారు.

అలాగే, అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును పెంచుతున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రెండేళ్ళలో ఐటీ రిటర్నులను దాఖలు చేయవచ్చునని చెప్పారు. పన్ను చెల్లింపు వ్యవస్థ మరింత సులభతరం అవుతుందన్నారు. రెండేళ్ళలోగా ఐటీ రిటర్నులను అప్‌డేట్ చేసుకోవచ్చునన్నారు. దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం తపాలా కార్యాలయాలు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల మంగళవారం లోక్‌సభ కు తెలిపారు. తపాలా కార్యాలయాలను ఆర్థిక విశ్వాస ఆధారిత సంస్థలుగా చేస్తున్నట్లు చెప్పారు ఆమె. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట లభించే విధంగా కృషి చేస్తామన్నారు నిర్మలా సీతారామన్ .

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =