రావిర్యాలలో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ

Atmagourava Dandora Public Meeting, Congress Dalita Girijana Atmagowrava Dandora Meeting, Congress’ Dalita Dandora, Dalit-Girijana Atmagourava Dandora Public Meeting, Dalita Girijana Atmagowrava Dandora, Dalita Girijana Atmagowrava Dandora Meeting, Mango News, Raviryal, Revanth Reddy, Telangana Congress, Telangana Congress Dalit-Girijana Atmagourava Dandora Public Meeting, Telangana Congress Dalit-Girijana Atmagourava Dandora Public Meeting At Raviryal, TPCC President Revanth Reddy

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, అదే ఉత్సాహంతో నేడు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో రెండో దండోరా సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రావిర్యాల సభ ప్రారంభమైంది. ఈ సభకు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్, పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు.

ముందుగా బుధవారం రావిర్యాలలో జరిగే దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దళిత, గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టేందుకే ఈ దండోరా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ సభ ఏర్పాట్లు, జన సమీకరణపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రత్యేక దృష్టిపెట్టారు. అలాగే రావిర్యాల సభ తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహణకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − four =