కరోనా వైరస్ నివారణ చర్యలు, వలస కార్మికుల సంక్షేమం, రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని అందుకు నిరసనగా మే 5 న ఒక రోజు దీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం నాడు పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్, మర్రి శశిధర్ రెడ్డి, వీ.హనుమంతు రావు, రాములు నాయక్ తదితరులు ‘సత్యాగ్రహ దీక్ష’ పేరుతో ఒక రోజు దీక్ష చేపడుతున్నారు. అలాగే జిల్లాల్లోని డీసీసీ కార్యాలయాలు, పార్టీ నేతల ఇళ్లలో ఈ దీక్ష చేపట్టాలని పార్టీ నాయకులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
దీక్ష సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా నియంత్రణ, సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో రైతులు పండించిన పంటల సేకరణ, కొనుగోలు అంశాలలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా విఫలమైందన్నారు. ఇప్పటికి కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన రూ.1500 సరిపోవని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అన్ని బీపీఎల్ కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రజలు తినడం లేదని, ఈ పరిస్థితుల్లో పేదలు తినడానికి సన్నబియ్యం పంపిణీ చేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన పిలుపుమేరకు వలస కార్మికులు తెలంగాణ నుంచి వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి టికెట్స్ కొనిచ్చి సహాయం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎక్కువుగా జరగడం లేదు, చనిపోయిన వారికి కరోనా టెస్టులు చేయకపోవడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Inspired by our ideological guide, Mahatma Gandhi, sitting on a Satyagraha Deeksha at Gandhi Bhavan along with @INCTelangana colleagues to protest shortcomings in procurement of agri produce & migrant workers welfare.#CongressForIndia#CongressShowsTheWay pic.twitter.com/KOle2iNsW3
— Uttam Kumar Reddy (@UttamTPCC) May 5, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]