తెలంగాణ రాష్ట్రంలో మరో 301 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 11, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,90,309 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1568 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.
కరోనా నుంచి కొత్తగా 293 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,84,217 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 97.90 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 4,524 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 58, మేడ్చల్- మల్కాజ్ గిరిలో 27, రంగారెడ్డి జిల్లాలో 16, వరంగల్ అర్బన్ లో 12, నల్గొండలో 12, కరీంనగర్ లో 11, నిజామాబాద్ లో 10, మంచిర్యాలలో 10, భద్రాద్రి కొత్తగూడెంలో 10, యాదాద్రి భవనగిరిలో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ