రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి తీవ్ర గాయాలు, ఆయన భార్య మృతి

His Wife and Aide were Died, Mango News Telugu, Shripad Naik car accident, Shripad Naik car accident news, Shripad Naik car accident updates, Union Minister Shripad Naik, Union Minister Shripad Naik critical, Union Minister Shripad Naik Has Surgery After Accident, Union minister Shripad Naik hurt in accident, Union Minister Shripad Naik Injured in Road Accident, Union Minister Shripad Yesso Naik wife

కేంద్ర రక్షణ, ఆయుష్‌ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్‌ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లాపూర్‌ నుంచి గోవర్ణ వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ఈ ఘటనలో మంత్రి శ్రీపాద్ నాయక్ కు తీవ్ర గాయాలవగా, ఆయన సతీమణి విజయ, సహాయకుడు దీపక్‌ ప్రాణాలు కోల్పోయారు. సమీప ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంత్రి శ్రీపాద్ నాయక్ ను గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేంద్రమంత్రి ఆరోగ్యపరిస్థితిపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని అన్నారు. చికిత్స కోసం ఆయనను ఢిల్లీకి మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు గోవా సీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ‌ మాట్లాడి కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here