తెలంగాణ రాష్ట్రంలో 1,213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు: సీఎం కేసీఆర్

Centre Decides to Start Corona Vaccination Drive, Corona Vaccination Drive, coronavirus vaccine distribution, Coronavirus Vaccine Distribution In India, covid 19 vaccine, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccine Distribution, COVID-19 Vaccine Drive, KCR, KCR Schedules Meeting With Government Officials, Mango News, Telangana cm kcr

జనవరి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే అవసరమైన వైద్య చికిత్స అందించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ సమీక్షించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా సీఎం పాల్గొన్నారు. ఈ రెండు సందర్భాల్లో సీఎం కేసీఆర్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ముందుగా ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్:

‘‘సీరం రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ను సమర్థవంతమైన కోవిడ్ వ్యాక్సిన్లుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్లనే తెలంగాణలో అందించాలని నిర్ణయించాం. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా బలగాలు, పారిశుధ్య సిబ్బంది తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తాం. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించాం. ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయించిన వారిని వ్యాక్సినేషన్ సెంటర్ కు తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలి. పోలీసులు, ఇతర భద్రతా బలగాలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యతను పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్/స్టేషన్ హౌస్ ఆఫీసర్ తీసుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు:

‘‘వ్యాక్సిన్ ను అన్ని పీహెచ్ సీల పరిధిలో ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. వ్యాక్సిన్ ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేశాం. అన్ని స్థాయిల్లో వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు భాగస్వాములు కావాలి. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే వారికి వెంటనే వైద్య చికిత్స అందించడానికి వీలుగా వ్యాక్సిన్ సెంటర్ కు అనుబంధంగా ఒక గదిని, వైద్యులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియలో కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =