కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కలెక్టర్లు

Collectors Visits Kaleshwaram Project, Districts Collectors Visits Kaleshwaram Project, Mango News Telugu, Political Updates 2019, Telangana Districts Collectors Visits Kaleshwaram, Telangana Districts Collectors Visits Kaleshwaram Project, Telangana Political Live Updates, Telangana Political News 2019, telangana political news.telangana politics, Telangana Political Updates, Telangana Political Updates 2019, TRS Latest News Updates

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు ఆగస్టు 27, మంగళవారం నాడు వరంగల్ చేరుకున్నారు. అక్కడ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. రాత్రికి వరంగల్ లోనే బస చేసి బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కలెక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. పర్యాటక శాఖకు సంబంధించిన ప్రత్యేక బస్సులో సోమేశ్ కుమార్ తో పాటు కలెక్టర్లు ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు.

బ్యారేజ్ సామర్థ్యం, నీటి లభ్యత, గేట్ల నిర్మాణం మొదలైన అంశాలను పరిశీలించారు. అనంతరం అక్కడ శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ ను సందర్శిస్తారు, ఆ తరువాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం  భూగర్భ పంప్ హౌస్ ను పరిశీలిస్తారు. సాయంత్రం రెండు రోజుల పర్యటనను ముగించుకుని తిరిగి వారివారి జిల్లాలకు బయలుదేరనున్నారు. కలెక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here