ప్రముఖ జ్యోతిష పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం

Astrologer Mulugu Ramalingeswara Siddhanti Passed Away, Condolences From VIPs, Famous Astrologer Mulugu Ramalingeswara Siddhanti Passed Away, Mango News, Mulugu Ramalingeswara, Mulugu Ramalingeswara Siddhanti Passed Away, Mulugu Ramalingeswara Siddhanti passes away, Noted astrologer Mulugu Ramalingeswara Siddhanti, Noted astrologer passes away, Prominent astrologers, Ramalingeswara Siddhanti Passed Away

శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైల, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (63) శివైక్యమయ్యారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం హైదరాబాద్ ‌లోని బంజారాహిల్స్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో.. నిమ్స్‌ ఆస్పత్రి వద్ద కారులోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే డ్రైవర్‌ నిమ్స్‌ ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా.. అక్కడ ఎమర్జెన్సీ బెడ్లు ఖాళీ లేకపోవడంతో సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మృతి చెందారని నిర్ధారించారు.

నాలుగు దశాబ్దాలకు పైగా జ్యోతిష రంగానికి సేవలందించిన ఆయన గుంటూరు జిల్లా పండరీపురం గ్రామంలో జన్మించారు రామలింగేశ్వర సిద్ధాంతి. జ్యోతిష రంగంలో అసమాన కీర్తి ప్రతిష్ఠలను సాధించారు. పంచాంగ శ్రవణం, రాశిఫలాలు, జ్యోతిష ఫలితాలను వెల్లడించడం ద్వారా ఖ్యాతి గడించారు. ఎన్నికలు, రాజకీయం సహా అనేక విషయాల్లో ఆయన చెప్పిన జ్యోతిషం చాలా సందర్భాల్లో అక్షర సత్యమైంది.  చంద్రబాబు, జయలలిత మళ్లీ ముఖ్యమంత్రులు అవుతారని ఆయన చెప్పిన జ్యోతిషం నిజమయింది. అలాగే, 2019లో జగన్ సీఎం అవుతారని చెప్పారు.. ఆయన చెప్పిందే నిజమయింది.

శ్రీశైలం లో ఆశ్రమం స్థాపించి వేదాలు, పూజా, హోమాది క్రతువుల్లో శిక్షణ పొందిన బ్రాహ్మణులతో కలిసి ఆయన ప్రతి మాస శివరాత్రికీ పాశుపతహోమాలు నిర్వహించేవారు. కాగా, రామలింగేశ్వర శాస్త్రి అంత్యక్రియలు సోమవారం ఉదయం 11 గంటలకు మలక్‌పేట్‌లోని హిందూ శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ములుగు మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమన్నారు. పంచాంగ కర్తగా, జ్యోతిష పండితుడిగా ఆయన చేసిన సేవలు నిరుపమానమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here