తెలంగాణలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

Telangana Finance Dept Gives Green Signal to Recruit 2440 Vacancies in Education Archives Departments, Telangana Finance Dept Gives Green Signal to Recruit 2440 Vacancies in Archives Department, Telangana Finance Dept Gives Green Signal to Recruit 2440 Vacancies in Education Department, 2440 Vacancies in Education Archives And Departments, Education Archives And Departments, 2440 Vacancies, Telangana Finance Dept, Telangana Finance Dept Gives Green Signal to Recruit 2440 Vacancies, job aspirants as notification for another 2440 vacancies in Education And Archives departments, Good news for the unemployed In Telangana, Telangana Finance Department News, Telangana Finance Department Latest News, Telangana Finance Department Latest Updates, Telangana Finance Department Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే గ్రూప్-1 సహా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్, రవాణా మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వంటి డిపార్ట్మెంట్స్ కు సంబంధించి పలు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిరుద్యోగ అభ్యర్థులకు మరో శుభ‌వార్త అందింది. రాష్ట్రంలో విద్యా, ఆర్కైవ్స్‌ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ లో మరో 2,440 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ శుక్రవారం అనుమతులు మంజూరు చేసింది. తాజాగా అనుమతులు ఇచ్చిన జాబితాలో 1,392 మంది జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల కూడా ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసిన మొత్తం పోస్టుల సంఖ్య 49,428కు చేరుకుంది.

తాజాగా అనుమతి లభించిన పోస్టుల వివరాలివే (2,440):

  • ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ – (1523) – జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు – 1,392, లైబ్రేరియన్లు – 40, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు – 91
  • పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పోస్టులు (టెక్నీకల్ ఎడ్యుకేషన్) – (359) – లెక్చరర్లు -247, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు – 14, లైబ్రరీయన్లు – 31, మాట్రన్- 5, ఎలక్ట్రీషియన్ -25, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు -37
  • కళాశాల విద్యావిభాగం – (544) – లెక్చరర్‌ పోస్టులు – 491, లైబ్రరీయన్లు – 24, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు – 29
  • ఆర్కైవ్స్‌ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ – 14 పోస్టులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =