తెలంగాణ: రేపు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న గవర్నర్ తమిళిసై, విద్యార్థులతో భేటీ

Telangana Governor Tamilisai Soundararajan To Visit Basara IIIT Campus and Meet with Students Tomorrow, Governor Tamilisai Soundararajan To Visit Basara IIIT Campus and Meet with Students Tomorrow, Tamilisai Soundararajan To Visit Basara IIIT Campus and Meet with Students Tomorrow, Telangana Governor To Visit Basara IIIT Campus and Meet with Students Tomorrow, Telangana Governor Tamilisai Soundararajan To Meet with Students Tomorrow, Rajiv Gandhi University of Knowledge Technologies IIIT Basara campus, RGUKT IIIT Basara campus, Basara IIIT Students, Basara IIIT Campus, Telangana Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan, Tamilisai Soundararajan, Telangana Governor, Basara IIIT Campus News, Basara IIIT Campus Latest News, Basara IIIT Campus Latest Updates, Basara IIIT Campus Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై శనివారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలులో బాసరకు పయనమవనున్నారు. కాగా ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వరుస ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యి పలువురు విద్యార్థులు ఆస్పత్రి పాలవడం వంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై పర్యటన జరుగనుండటం గమనార్హం. ఈ క్రమంలో బాసర చేరుకున్న తర్వాత గవర్నర్ ముందుగా సరస్వతీ దేవీ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here